ముంబై – డెహ్రాడూన్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హాస్పిటల్ నుంచి తొలి ట్విట్ చేశాడు. డిసెంబర్ 30న ఢిల్లీ- డెహ్రాడూన్ రహదారిలో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ దీరుబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆక్కడి నుంచే ట్వీట్ చేశాడు ” నాకు వచ్చిన గుడ్ విషెస్‌కి, ఈ సపోర్ట్‌కి నేను ఎంతో కృతజ్ఞుడిని. నా సర్జరీ విజయవంతమైందని తెలియచేస్తున్నా. కోలుకోవడం మొదలెట్టా. ముందు వచ్చే ప్రతీ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నాకు అన్ని విధాల అండగా నిలిచిన బీసీసీఐ, జై సా, ప్రభుత్వ అధికారులకు థ్యాంక్యూ… ‘ అంటూ ట్వీట్ చేశాడు రిషబ్ పంత్. కారు ప్రమాదం నుంచి కాపాడి హాస్పిటల్ లో చేర్చిన ఇద్దరు యువకులు, డాక్టర్ ఉన్న ఫోటోను ఈ ట్వీట్ కి జత చేశాడు రిషబ్
కాగా.జనవరి 7న ముంబైలోని కోకిలాబెన్ దీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో రిషబ్ పంత్ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. అతను మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నాడని సమాచారం…
I may not have been able to thank everyone individually, but I must acknowledge these two heroes who helped me during my accident and ensured I got to the hospital safely. Rajat Kumar & Nishu Kumar, Thank you. I'll be forever grateful and indebted 🙏♥️ pic.twitter.com/iUcg2tazIS
— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023