Friday, November 22, 2024

చ‌మురు ధ‌ర ఆధారంగానే ఇంధ‌న ధ‌ర‌ల పెంపు : హర్దీప్‌ సింగ్‌.!

అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలను బట్టే దేశీయంగా చమురు ధరలు ఆధారపడి ఉంటాయని, ప్రస్తుతం ఒక దేశంలో యుద్ధం నడుస్తోందని, చమురు సంస్థలు ఆ అంశాలను పరిగణలోకి తీసుకుంటాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి అన్నారు. అన్ని పరిశీలించిన తరువాతే.. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బాగా పెరుగుతున్నాయన్నారు. మంత్రి ప్రకటనను బట్టి చూసుకుంటే.. చమురు ధరలకు అనుగుణంగానే భారత్‌లో ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ వారంలోనే చమురుసంస్థలు ధరలు పెంచనున్నట్టు తెలుస్తోంది. కేంద్రం చివరిసారిగా నవంబర్‌లో ధరలు సవ రించిందని గుర్తు చేశారు. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజెల్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందన్నారు. అప్పటి నుంచి ధరల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగానే ధరలు పెంచలేదని తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement