Tuesday, November 26, 2024

RIP – సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూత

న్యూఢిల్లీ- సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. సులభ్ ఇంటర్నేషనల్ సెంట్రల్ ఆఫీస్‌లో జెండా ఎగురవేసిన తరువాత ఆయ‌న ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయ‌ను చికిత్స కోసం ఎయిమ్స్ త‌ర‌లించారు. చికిత్స పొందుతూ అక్క‌డే మ‌ర‌ణించారు..

బీహార్ లోని వైశాలి జిల్లా రాంపూర్ బాఘేల్ గ్రామంలో జన్మించిన పాఠక్.. 1964లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1980లో మాస్టర్స్ డిగ్రీని , 1985లో PhDని పూర్తి చేశారు. దేశంలోని పారిశుధ్య సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో 1970లో సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్‌ను స్థాపించారు.
1991లో మాన్యువల్ స్కావెంజర్లను విముక్తి చేయడం, పునరావాసం కల్పించడం కోసం, పోర్-ఫ్లష్ టాయిలెట్ టెక్నాలజీని అందించారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం పాఠక్ చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును అందించింది. అలాగే పారిశుధ్యం,పరిశుభ్రత రంగంలో ఆయన చేసిన కృషికి వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆయన ఆక‌స్మిక మృతి ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement