Saturday, November 16, 2024

RIP – నవజాత శిశువులు మృతి – రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

యుపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు.చిన్నారుల మృతి హృదయ విదారకమన్నారు.

ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విచారం వ్యక్తం చేశారు

రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా.. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు బాధిత తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

.పీఎం మోదీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. పిల్లలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖాన్ని భరించే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది’ అని దానిలో పేర్కొన్నారు..

- Advertisement -

తక్షణ పరిహారం రూ. 5 లక్షలుఈ ఘటనపై యూసీ సీఎం యోగి విచారం వ్యక్తం చేస్తూ, మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన చిన్నారులకు రూ.50 వేలు చొప్పున సాయం అందించాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రిజేష్‌ పాఠక్‌, హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అగ్ని ప్రమాదం జరిగిన మెడికల్‌ కాలేజీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం

Advertisement

తాజా వార్తలు

Advertisement