మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రిద్ది కుమార్ ‘ఫేస్ ఆఫ్ ఇండియా’ అవార్డ్ గెలుచుకొని ప్రతిభను చాటుకుంది. సినిమాలపై ఉన్నఆసక్తితో ఈ కేరళ బ్యూటీ దిల్ రాజు ప్రొడక్షన్లో ‘లవర్’ సినిమాలో రాజ్ తరుణ్ జోడీగా నటించి తెలుగు తెరకు పరిచయమైంది. నటిగా మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత మలయాళం, కన్నడ, మరాఠీ, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు రావడంతో తెలుగు సినిమాలకు దూరమైంది. రచయిత, దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ‘కోతికొమ్మచ్చిస లో కూడా లీడ్ రోల్ చేస్తోంది. ఇంకా ఇప్పటివరకు ‘రాధే శ్యామ్ ‘ సినిమాలో పూజా హెగ్డే మాత్రమే కనిపించేది. తాజాగా యూవీ క్రియేషన్స్ వారు విడుదల చేసిన రాధే శ్యామ్ ట్రైలర్ లో అర్చరీ విభాగంలో స్పోర్ట్ విమెన్ గా తళుక్కున మెరిసింది రిద్ది కుమార్. చేసింది రెండు సినిమాలే అయినా అప్పుడే ప్రభాస్ తో నటించే చాన్స్ కొట్టేసిందేంటబ్బా అని అంతా ఈ అమ్మడు గురించి మాట్లాడుకుంటున్నారు.
‘‘తెలుగులో నేను తక్కువ సినిమాలు చేసినా ఇంత తక్కువ సమయంలోనే ప్రభాస్ వంటి బిగ్ స్టార్ తో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో స్పోర్ట్స్ విమెన్ క్యారెక్టర్‌గా చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ కొరకు అర్చరీ నేర్చుకున్నా. ఇటలీలో వర్క్ చేసినప్పుడు కూడా షూటింగ్లో ఎంతో బిజీగా ఉన్నా ప్రభాస్ మాతో జోవియల్‌గా ఉంటూ నవ్వించేవారు. తను చాలా హుంబుల్ పర్సన్. తనతో వర్క్ చేయడం అదృష్టంగా బావిస్తున్నా. ఇందులో నా పాత్ర బబ్లీ గా కాకుండా పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ ఎలాంటిదనేది ఇప్పుడు చెప్పలేను” అంటూ మూవీ కబుర్లు చెప్పుకొచ్చింది రిద్ది కుమార్..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..