హైదరాబాద్, ప్రభన్యూస్: హైదరాబాద్ బోరబండ పరిధిలోని స్వరాజ్ నగర్ హరిహర క్షేత్ర దేవస్థానంలో వెలిసిన స్వయంభూ శ్రీశ్రీశ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు రెండో రోజుకు చేరాయి. అంగరంగ వైభోవపేతంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రోజున స్వామి వారి కల్యాణాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవతో మొదలైన స్వామి వారి కల్యాణ వేడుకలలో భాగంగా ఆలయ అర్చకులు ప్రాభోధిక సేవను నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణాల నడుమ యాగశాల ప్రవేశం, యాగా మండపారాధన, బలి హారణం, నిత్య హోమాలతో ఆలయ ప్రాంగణం స్వామి వారి సేవలో తరించిపోయారు.
దానికి అనుబంధంగా అన్నప్రసాదం, కుంకుమ పూజలతో పాటు- పురవీధులలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను కల్యాణంలో పాల్గొన్న దంపతులు ఊరేగింపు నిర్వహించగా విశేష సంఖ్యలో భక్తులు ఎదురేగి ఊరేగింపులో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు ట్రాన్స్‌క్కో జెన్కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించగా రెండో రోజు విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కలువల సత్యనారాయణ రావు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..