Friday, November 22, 2024

కుబేరుడు నెంబర్‌ 1 ఎలాన్‌ మస్క్‌.. 32వ స్థానానికి పడిపోయిన అదానీ

ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానంలోకి వచ్చారు. 2022లో రికార్డ్‌ స్థాయిలో సంపద కోల్పోయి గిన్నీస్‌ బుక్‌లో ఎక్కిన మస్క్‌ తిరిగి తన స్థానాన్ని సాధించారు. టెస్లా షేర్లు భారీగా లాభపడటంతో ఆయన సంపద విలువ పెరిగింది. బ్లూమ్‌బర్గ్‌ సూచీ ప్రకారం సోమవారం నాడు మార్కెట్లు ముగిసే సమయానికి ఎలాన్‌ మస్క్‌ ఆస్తుల విలువ 187.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ను ఎలాన్‌ మస్క్‌ వెనక్కి నెట్టారు. తాజా లెక్కల ప్రకారం అర్నాల్ట్‌ సంపద 185.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

గత సంవత్సరం నవంబర్‌-డిసెంబర్‌ మధ్యలో టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్ ఆస్తుల విలువ 200 బిలియన్‌ డాలర్లు పతనమైంది. చరిత్రలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక సంపదను కోల్పోయిన వ్యక్తిగా మస్‌ ్క గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఎక్కారు. 2021 నవంబర్‌ నాటికి 340 బిలియన్‌ డాలర్ల ఆస్తులున్న మస్క్‌, గత సంవత్సరం చివరి నాటికి 137 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. టెస్లా కంపెనీ షేర్లు కోవిడ్‌, చైనాలో లాక్‌డౌన్‌ మూలంగా 65 శాతం విలువ కోల్పోయాయి. 2022లో టెస్లా కంపెనీ 700 బిలియన్‌ డాలర్లు కోల్పోయింది.

గత సంవత్సరం ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లకు మస్క్‌ కొనుగోలు చేశారు. ఇందులో చాలా వరకు ఆయన స్వంత షేర్లు అమ్మి నిధులు సమకూర్చుకున్నారు. దీని వల్ల కూడా ఆయన సంపద విలువ తగ్గింది. ట్విటర్‌ను కొనుగోలు చేసే సమయానికి రోజుకు 4 మిలియన్‌ డాలర్ల మేర నష్టం వస్తోంది.

- Advertisement -

అమెజాన్‌ అధిపతి జఫ్‌ బెజోస్‌ 117 బిలియన్‌ డాలర్ల సంపదతో కుబేరుల జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. 2023లో టెస్లా షేర్ల విలువ నాస్డాక్‌లో 92 శాతం పెరిగాయి. టెస్లాలో మస్క్‌కు 13 శాతం వాటా ఉంది. ఆర్నాల్ట్‌ ఆస్తుల విలువ 2023లో 23.3 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అమెజాన్‌ అధిపతి జఫ్‌ బెజోస్‌ ఆస్తుల విలువ 10.2 బిలియన్‌ డాలర్లు పెరిగాయి. మన దేశానికి చెందిన రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ సంపద విలువ 81.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ముఖేష్‌ అంబానీ 6.02 బిలియన్‌ డాలర్ల మేర సంపదను కోల్పోయారు. ప్రస్తుతం ఆయన కుబేరుల జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు.

3 నుంచి 32కు అదానీ..

ప్రపంచ కుబేరుల జాబితాలో 2022, డిసెంబర్‌ వరకు 3వ స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ ప్రస్తుతం 32వ స్థానానికి పడిపోయారు. అదానీ సంపద నికర విలువ ప్రస్తుతం 37.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. హిండెన్‌బర్గ్‌ వెలువడిన జవనవరి 24 తరువాత ఆయన 82.8 బిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ఆయన 3వ స్థానం నుంచి 32వ స్థానానికి పడిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement