న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత మహిళా క్రికెట్ జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. వికెట్ కీపర్ రిచా ఘోష్ మాత్రం గుర్తుండిపోయేలా ఓ ఇన్నింగ్స్ ఆడి రికార్డు నెలకొల్పింది. భారత జట్టుకు చెందిన 18 ఏళ్ల వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో 26 బంతుల్లోనే 14 ఏళ్ల నాటి భారత రికార్డును బ్రేక్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆమె తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిందనే చెప్పవచ్చు. వర్షం కారణంగా నాలుగో వన్డేలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 192 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల ముందు ఉంచింది. దీంతో భారత జట్టు 17.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఇందులో రిచా ఘోష్ 52 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచింది.
రిచా ఘోష్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో పలు రికార్డులు బద్దలు..
రిచా ఘోష్ ప్రస్తుతం మహిళల క్రికెట్‌లో భారత్ తరపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఆమె 52పరుగుల ఇన్నింగ్స్‌లో, కేవలం 26 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసింది. ప్రపంచ క్రికెట్‌లో 26 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన మహిళా బ్యాటర్లు కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రిచా ఘోష్.. 14 ఏళ్ల క్రితం మరో భారత మహిళ రికార్డును బద్దలు కొట్టింది. గతంలో ఈ భారత రికార్డు రుమేలీ ధర్ పేరిట ఉండేది. రుమేలీ ధర్ 2008లో శ్రీలంకపై 28 బంతుల్లో తన యాభైని పూర్తి చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..