Friday, November 22, 2024

Delhi: రేప‌టి నుంచి నాఫెడ్ ఔట్‌లెట్లలో కిలో రూ.29కే బియ్యం అమ్మకాలు…

న్యూ ఢిల్లీ – దేశంలో బియ్యం ధ‌ర‌లు ఎగ‌బాక‌డంతో వీటి ల‌భ్య‌త‌ను పెంచి ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్ బ్రాండ్ పేరిట కిలో బియ్యాన్ని రూ.29కి విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. స‌బ్సిడీ బియ్యాన్ని నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్‌సీసీఎఫ్‌) కేంద్రీయ భండార్ అవుట్‌లెట్ల ద్వారా విక్ర‌యించ‌నుంది.. ఈ మేర‌కు అన్నిఏర్పాట్లు చేసిన‌ట్లు కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..

కాగా, ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే గోధుమ‌పిండి, ప‌ప్పుధాన్యాల‌ను భార‌త్ ఆటా, భార‌త్ దాల్‌ పేరుతో త‌క్కువ‌ ధ‌ర‌ల‌కే అందిస్తోంది. న‌వంబ‌ర్‌లో తృణ‌ధాన్యాల ధ‌ర‌లు ప‌దిశాతంకు పైగా ఎగ‌బాక‌డంతో ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం 8.7 శాతానికి పెరిగింది. ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డికి, దేశంలో బియ్యం ల‌భ్య‌త‌ను పెంచేందుకు కేంద్రం భార‌త్ రైస్ పేరిట స‌బ్సిడీ ధ‌ర‌కే బియ్యం అందించాల‌ని నిర్ణ‌యించింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement