ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈమేరకు రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ‘మోడీ ఇంటిపేరు’పై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో లోక్‌సభ సెక్రటేరియట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కేసులో రాహుల్ ను నాలుగు నెలల క్రితం లోక్ సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేశారు.. దీనిపై న్యాయపోరాటంలో చేసిన రాహుల్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అనర్హత వేటు తొలగించడంతో వర్షకాల సమావేశాలలో రాహుల్ పాల్గొననున్నారు..