Friday, November 22, 2024

వార్తా సంస్థలకు ఆదాయాన్ని పంచాలి.. బిగ్‌టెక్‌ అగ్రిగేటర్లకు సూచన

డిజిటల్‌ వార్త సంస్థల కంటెంట్‌ను ఉపయోగించి ఆదాయాన్ని ఆర్జించే బిగ్‌ టెక్‌ అగ్రిగేటర్లు అందులో న్యాయమైన భాగాన్ని సంబందిత ప్రచురణకర్తలతో పంచుకోవాలని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర సూచించారు. 17 మీడియా సంస్థల డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌ అసోసియేషన్‌ (డీఎన్‌పీఏ) కాక్లేవ్‌ ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి ఆయన ఒక సందేశం పంపించారు. ఆస్ట్రేలియా, కెనడా, ప్రాన్స్‌, యూరోపియన్‌ యూనియన్‌ ఇప్పటికే చట్ట సభల ద్వారా ఈ విధమన చర్యలు తీసుకున్నాయని ఆయన చెప్పారు. వార్తల ద్వారా వచ్చే ఆదాయం, వార్త ప్రచురణకర్తలు, అగ్రిగేటర్ల మధ్య న్యాయంగా విభజన జరిగేలా అవి చొరవ చూపాయన్నారు.

కొవిడ్‌ తరువాత డిజిటల్‌ వార్త పరిశ్రమతో పాటు, ప్రింట్‌, న్యూస్‌ వ్యవస్థ సైతం ఆర్ధికంగా దెబ్బతిన్నదని ఆయన చెప్పారు. పరిశ్రమపై ప్రతికూల ప్రభావం కొనసాగితే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిజం భవిష్యత్తుకూడా దెబ్బతింటుందన్నారు. దేశానికి సేవ చేసిన చరిత్ర ఈ పరిశ్రమకు ఉందన్నారు. వార్త పరిశ్రమ వృద్ధికి, డిజిటల్‌ న్యూస్‌ పబ్లిషర్‌ల కంటెంట్‌ ద్వారా బిగ్‌ టెక్‌ అగ్రిగేటర్లకు వచ్చే రాబడిలో సంబంధిత వార్తా సంస్థలు న్యాయమైన వాటా పొందడం చాలా ముఖ్యమని చెప్పారు.
ఆస్ట్రేలియా ఎంపీ పాల్‌ ప్లెచర్‌ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఆదాయ విభజనపై రూపొందంచిన ముసాయిదాపై తొలుగ గూగుల్‌, ఫేస్‌బుక్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement