బీహార్ : బీహార్ లో పోలీసు బ్యూటీపార్లర్ లోకి చొరబడి పెళ్లికూతురి ముస్తాబవుతున్న యువతి మీద కాల్పులు జరిపాడు. ఇది ప్రేమ తిరస్కారాన్ని తట్టుకోలేకపోవడం వల్ల కోపోద్రిక్తుడైన బీహార్ పోలీసు కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. వివరాలలోకి వెళితే ఆదివారం రాత్రి వివాహం చేసుకోనున్న అపూర్వ కుమారి తన పెళ్లికి బ్రైడల్ మేకప్ వేసుకోవడానికి బ్యూటీ పార్లర్‌కి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నాఆమె ప్రియుడు ,కానిస్టేబుల్ అమన్‌కుమార్ పార్లర్ లోకి చొరబడి పెళ్లికి ముస్తాబవుతుండడం చూసిన అతను కోపంతో రగిలిపోయాడు. వెంటనే తన దగ్గరున్న తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆమె ఎడమ భుజాన్ని, మరో బులెట్ ఆమె ఛాతీ కుడి వైపున తాకింది. మహిళపై కాల్పులు జరిపిన తరువాత, కానిస్టేబుల్ కూడా చనిపోవాలని కణతలకు తుపాకీని పెట్టి కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. అయితే, భయంతో పిస్టల్ అతని చేతిలో నుండి జారిపోవడంతో ఆ ప్రయత్నం విఫలమయ్యింది. కాల్పులు జరిపిన తరువాత అక్కడి నుండి పారిపోతుండగా, పార్లర్లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ అతను తప్పించుకుని, అక్కడినుంచి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన అంతా బ్యూటీపార్లర్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మహిళను ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. పొలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement