దక్షిణాది సినీ ప్రముఖులపై మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేశారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. దాదాపు 14 మంది ఆమెను నోటికి చెప్పలేని విధంగా దూషించారనే విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ సంపత్ బయటపెట్టిన 14 మంది పేర్లలో ఓ డాక్టర్, ఓ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు
14 మంది జాబితా: రాజేశ్ టచ్‌రివర్ (దర్శకుడు), సిద్ధిక్ (నటుడు), ఆషికి మహి(ఫొటోగ్రాఫర్), సిజ్జు (నటుడు), అభిల్ దేవ్ (కేరళ ఫ్యాషన్ లీగ్ ఫౌండర్), అజయ్ ప్రభాకర్ (డాక్టర్), ఎంఎస్ పదూష్ (అబ్యూసర్), సౌరబ్ కృష్ణన్ (సైబర్ బల్లీ), నందు అశోకన్ (డివైఎఫ్ఐ కమిటీ మెంబర్), మాక్స్వెల్ జోస్ (షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్), షానుబ్ కరావత్ (యాడ్ డైరెక్టర్), రాగేంద్ పై (క్యాస్టింగ్ డైరెక్టర్), సరున్ లియో (ఈఎస్ఎఎఫ్ బ్యాంక్ ఏజెంట్), బిను (సబ్ ఇన్స్పెక్టర్ పొన్‌తూరా స్టేషన్, తిరువనంతపురం)
దీంతో ఒక్కసారిగా మలయాళ చిత్ర పరిశ్రమ కుదుపుకు లోనైంది. కాగా కాస్టింగ్ కౌచ్‌కు సంబంధించి తన ఫేస్బుక్ అకౌంట్లో పలు పోస్టులు చేశారు రేవతి. అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లోనూ తనను వేధింపులకు గురిచేసిన వారి పేర్లతో పోస్టులు చేశారు. సోషల్ మీడియాలో సంచలనం రేపిన రేవతి సంపత్ విషయంలో మలయాళ సినీ పరిశ్రమ, కేరళ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.