రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రాక్షస పాలన కొనసాగుతుందని హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎఫ్ ఏఆర్ లు పోలీస్ స్టేషన్ నుంచి రావడం లేదని.. గాంధీభవన్ నుంచి వస్తున్నారంటూ మండిపడ్డారు.
‘‘రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో పాలన కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టాలనే రేవంత్ పగబట్టాడు. రేవంత్ పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తొంది. ఎక్కడ డబ్బులు సంపాదించాలి… ప్రతి పక్షాలపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. రైతు డిక్లరేషన్‌లోని తొమ్మిది హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్పై సంతకాలు చేసి ఓట్లు వేయించుకున్నారు. ఆ హామీలు అమలు చేయాలని అడుగుతున్నాం.. తప్పా?. అని అన్నారు. పోలీసులు చట్టానికి లోబడి పని చేయాలి అన్నారు. పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు. ” అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.