Monday, September 30, 2024

Delhi | మళ్ళీ ఢిల్లికి రేవంత్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయల్ధేరి వెళ్ళారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం పరామర్శించనున్నారు. ఆ

తర్వాత ఢిల్లీలోని ఏఐసీసీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపై మాట్లాడనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీలో టీపీసీసీ కార్యవర్గం పైనా చర్చించనున్నారు.

తాజా పర్యటనతో మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఎవరికి అవకాశం దక్కుతుందో అని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దసరాలోపు మంత్రి వర్గాన్ని చేపట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి చూస్తున్నారని వివ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అంతే కాకుండా హైడ్రా, మూసీ ప్రక్షాళన తదితర అంశాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణాలను ఆయన అధిష్ఠానానికి వివరించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement