Saturday, November 23, 2024

TS | సింగరేణి కార్మికులకు సీఎం భరోసా… బీమా పథకాన్ని ప్రారంభించిన రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. బీమా పథకం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ పాల్గొన్నారు. ఇప్పటి వరకు కోటి ప్రమాద బీమా పథకం కేవలం సైనికులకు మాత్రమే ఉండేదని సింగరేణి ఎండీ బలరాం స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా రూ. 40 లక్షల బీమా పథకం అమలు చేయడం గొప్ప నిర్ణయమన్నారు. 43 వేల మందికి ఈ బీమా పథకం వర్తిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులకు సరైన న్యాయం జరగలేదన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement