రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు ను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా కేంద్ర ప్రభుత్వం మార్చినం విషయం తెలిసిందే. అయితే ఖేల్ రత్న పేరు ముందు రాజీవ్ పేరును మార్చడం పట్ల కాంగ్రెస్ నేతలు బీజేపీపై మండిపడుతున్నారు. రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ను పేరు మార్చి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా నామకరణం చేయడం దారుణం అని అన్నారు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి. ఇది బీజేపీ, మోడీ పాలకుల సంకుచిత బుద్ధికి నిదర్శనం అని తెలిపారు. యువకులను అన్ని రంగాలలో ప్రోత్సహించి దేశంలో క్రీడా అభివృద్ధి కి ఎంతో కృషి చేసిన స్వర్గీయ భారత రత్న రాజీవ్ గాంధీ పేరును ఖేల్ రత్నగా ఉండడం సముచితం. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు మార్చుకొని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కొనసాగించాలి. రాజీవ్ గాంధీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ధోనీ ట్విట్టర్ అకౌంట్‌కు బ్లూ టిక్ మాయం