ఏపీ నుంచి హైదరాబాద్కు చికిత్స కోసం వచ్చే కరోనా రోగుల అంబులెన్సులను చెక్ పోస్టుల్లో అడ్డుకోవడం సరికాదని ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మానవత్వంతో ఆలోచించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తక్షణమే ఈ సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ఏపీ కరోనా రోగులకు తెలంగాణలోకి అనుమతి లేక పోవడంతో యస్.శివారెడ్డి అనే వ్యక్తిని కర్నూలు ఆస్పత్రిలో చేర్పించడం జరిగిందన్నారు. కరోనా రోగుల అనుమతి విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించే దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement