Monday, November 18, 2024

ప్రతిరోజు 1000 మంది భోజనం.. గొప్ప మనసు చాటుకున్న రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎం.పీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి రోజు కరోనో బాధితులకు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభం అయింది.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు… ఈ కార్యక్రమం ప్రారంభించమన్నారు. లాక్ డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదు. ఫస్ట్ వేవ్ లో కూడా ప్రభుత్వాలు కనీస సౌకార్యాలు ఏర్పాటు చేయలేదు. యూత్ కాంగ్రెస్ తరపున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే అరెస్ట్ లు చేస్తున్నారు విచారణ పేరిట అడ్డుకుంటున్నారని అన్నారు రేవంత్.

గాంధీ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ అయినా… కనీస సౌకర్యాలు లేవనిఅన్నారు. డాక్టర్, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం ఏర్పాటు చేయలేదు. ప్రతి రోజు 1000 మందికి ఇక్కడ ఆహారం ఏర్పాటు చేస్తున్నాం. లాక్ డౌన్ ఉన్నంత వరకు భోజన వసతి కల్పిస్తాం..5 రూపాయలకే భోజనం .. కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. ఈ టైం లో కూడా ప్రభుత్వం భోజనం ఏర్పాటు చెయ్యలేదు. డాక్టర్స్, నర్సులు, సిబ్బంది, పేషంట్స్, వారి బంధువులకు 1000 మందికి భోజనం ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఈ రోజు రేపు వ్యాక్సిన్ బంద్, సెకండ్ డోస్ అందించడానికి వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ లేక ఇలా డోసుల వ్యవధి పెంచుతున్నారు.

టిమ్స్ లో 8 వ ఫ్లోర్ తరువాత ఆక్సిజన్ అందడం లేదు. బెడ్స్ కొరత, ఆక్సిజన్ , రెమెడిషివర్ కొరత తీవ్రంగా ఉంది.
సిగ్గు లేకుండా వసూళ్ల కోసం .. ప్రగతి భవన్ లో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం అయ్యింది… అవసరమయిన సమస్యలను చర్చించలేదు. ఒక గర్భిణీ వైద్యం అందక చనిపోయింది… స్మశాన సిబ్బంది కూడా తల్లిని బిడ్డను వేరు చేస్తేనే దహనం అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో కనీస సౌకర్యాలు లేవు. టాస్క్ ఫోర్స్ లో వసూల్ టీం మాత్రమే ఉంది. వైద్యులు ఎవరు లేరు.

కార్పొరేట్ కంపెనీలను పిలిచి… దండుకోవడాని ప్రయత్నం చేస్తున్నారు..అందరికి వ్యాక్సిన్ అందాలి.కాంగ్రెస్ నాయకుల మీద వేధింపులు ఆపాలి. రెమెడిషివర్ బ్లాక్ మార్కెట్ అయ్యింది.. టిఆర్ఎస్ నాయకులు కంపెనీల దగ్గర స్టాక్ పెట్టుకుంటున్నారు. కావాల్సిన వారికి రెమెడిషివర్ ఇచుకుంటున్నారు. కరోనా వల్ల తల్లి దండ్రులు చనిపోతే… పిల్లలకు 5 వేలు ఛాతీస్ ఘండ్ లో ఇస్తున్నారు.. ఇక్కడ కూడా ఇవ్వాలి. యశోద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా కోట్ల బిల్లులు వేస్తున్నారు. మెడిషన్ వాడకుండా బిల్స్ వేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement