Friday, November 22, 2024

TS: రేవంత్ ది రివ‌ర్స్ పాల‌న‌… హ‌రీశ్ రావు

అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసింది కాంగ్రెస్
మ‌హిళ‌ల‌కు ఇస్తాన‌న్న 2500కు మంగ‌ళం
క‌ల్యాణ‌ ల‌క్ష్మీలో తులం బంగారం మాయం
విద్యుత్ కోత‌ల‌తో కాలిపోతున్న‌ మోటార్లు
ఉలుకు ప‌లుకు లేని ప్రభుత్వం …
రేవంత్ ను మించి ఆబ‌ద్దాలాడుతున్న రాహుల్, ప్రియాంకాలు
హుస్నాబాద్‌ ప్రచారంంలో హ‌రీశ్ రావు విమ‌ర్శ‌లు

హుస్నాబాద్‌: ప్రస్తుత ప్రభుత్వం రివర్స్‌ గేర్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేసీఆర్ పాల‌న‌లో విద్యుత్‌ నిరంతరం ఉండేదని.. ఇప్పుడు నిత్యం సరఫరా నిలిచిపోతోందన్నారు. రైతులు, నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.కాంగ్రెస్‌ నేతలు అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా నేడు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారని.. 5 నెలలవుతున్నా దిక్కులేదని విమర్శించారు.

కల్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్‌ అయింది.. తులం బంగారం తుస్సుమన్నదని చెప్పారు. పెండ్లి చేసుకున్న వాళ్లకు తులం బంగారం ఇస్తామన్న హామీ అమలు కాలేదన్నారు. పైగా కాంగ్రెస్‌ వచ్చాక బంగారం ధరలు కొండెక్కాయని, కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ నిలిచిపోయిందని చెప్పారు. కేసీఆర్‌ ఇవ్వడం లేదని విమర్శించారు.

ప్రియాంక గాంధీ గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్‌కు వచ్చినప్పుడు తాము గెలిస్తే ఇక్కడ మెడికల్‌ కాలేజీ ఇస్తామని చెప్పారని గుర్తించారు. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళల ఖాతాల్లో రూ.2500 జమ చేశామని రాహుల్‌ గాంధీ చెప్పారని, ఆయన అబద్ధాల గాంధీగా మారారని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, ధాన్యానికి రూ.500 బోనస్‌ రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

- Advertisement -

హైదరాబాద్‌ సరూర్‌నగర్‌లో నిర్వహించిన రాహుల్ గాంధీ మీటింగ్ తుస్ మన్నది. 30వేల కుర్చీలు వేసి కూలర్లు పెడితే పట్టుమని 3 వేల మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రోడ్డు మీదకి పోయి లోపలకు రండని బ్రతిమిలాడిన ఎవరూ వస్తలేరని చెప్పారు. పొర‌పాటున కాంగ్రెస్ కి ఓటేస్తే తాము ఏమీ ఇవ్వ‌క‌పోయినా గెలిపించార‌నే భావ‌న‌తో ఉన్న ప‌థ‌కాల‌ను సైతం రేవంత్ ఆపివేస్తార‌న్నారు… ప్ర‌జ‌లంద‌రూ అన్ని ఆలోచించి మంచి చేసే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల‌ని కోరారు హ‌రీశ్ రావు..

Advertisement

తాజా వార్తలు

Advertisement