Wednesday, December 18, 2024

TG | కౌశిక్‌రెడ్డి మొబైల్‌ను తిరిగి ఇచ్చేయండి.. హైకోర్టు ఆదేశం !

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బంజారాహిల్స్‌ సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నమోదైన కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో కేసు విచారణ సమయంలో తీసుకున్న పాడికౌశిక్‌రెడ్డి మొబైల్‌ను తిరిగి ఇచ్చేయాలని పోలీసులను ఆదేశించింది.

కాగా సీఐ విధుల ఆటంకం కేసు దర్యాప్తులో భాగంగా అతడి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా మొబైల్‌ను లాక్కున్నారంటూ కౌశిక్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

మొబైల్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కుట్రలు పన్నుతున్నారని వాదించారు. ఫోన్‌ సీజ్‌ చేయాల్సి వస్తే నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement