Tuesday, November 19, 2024

Retirement – కుస్తీ గెలిచింది – నేనే ఓడిపోయా …

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ రెజ్లింగ్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించింది. పారిస్‌ గడ్డపై త్రివర్ణపతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించాలనుకున్న ఆమె ఆశలను అదనపు బరువు తుడిచివేసింది. దీంతో రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

‘రెజ్లింగ్‌ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. మీక, నా ధైర్యం విచ్ఛిన్నమైంది. నాకు ఇంకా పోరాడే బలం లేదు’ అని పేర్కొంది. రెజ్జింగ్‌ 2001-2024 గుడ్‌బై అంటూ ట్వీట్‌ చేసింది..

పారిస్‌ ఒలింపిక్స్‌ 50 కిలోల ఫ్రీస్టయిల్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన వినేశ్‌.. నిర్దేశిత బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. అయితే తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ ఫోగాట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేసన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ను ఆశ్రయించింది. తనను సిల్వర్‌ మెడల్‌కు అర్హురాలినని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తున్నది. దీనిపై ఆర్బిట్రేషన్‌ తీర్పు వెలువరించాల్సి ఉన్నది. ఈలోపే ఆమె అనూహ్యంగా వీడ్కోలు ప్రకటించింది.

గత రెండు ఒలింపిక్స్‌లను తలపిస్తూ పారిస్‌లోనూ వినేశ్‌కు చేదు అనుభవమే ఎదురైంది. రియోలో కాలు విరిగితే..టోక్యోలో ఆదిలోనే ఓటమి.. ఇప్పుడు పారిస్‌లో అనర్హత వేటు ఫోగాట్‌ పతక కలను చిదిమేశాయి. గత ఏడాది కాలంగా పాలకులతో చేస్తున్న పోరాటం ఓవైపు అయితే తనపై వస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేందుకు బౌట్‌లో శక్తికి మించి పోరాడిన వినేశ్‌..పారిస్‌లో పతకమే లక్ష్యంగా పోటీకి దిగింది. తన రెగ్యులర్‌ విభాగం 53కిలోలు కాకుండా ఈసారి 50కిలోల కేటగిరీ ఎంచుకున్న ఫోగాట్‌కు యు సుసాకీ రూపంలో ఫెవరేట్‌ ఎదురైనా వెరువకుండా పోరాడి సంచలన విజయం సాధించింది. అదే జోరులో క్వార్టర్స్‌, సెమీస్‌ బౌట్లలో ప్రత్యర్థులను చిత్తుచేసి ఫైనల్‌ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా నిలిచింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement