హైదరాబాద్: ఐపీఎల్-2024కి సంబంధించి రిటైన్, రిలీజ్ ప్రక్రియా పూర్తయింది. నవంబర్ 26 చివరి తేది కావడంతో మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఇక, డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరగనుంది. తొలిసారి భారత్‌లో కాకుండా విదేశి గడ్డపై ఈ వేలం నిర్వహిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
అందరూ ఊహించునట్టుగానే హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ప్రముఖ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రూక్‌ను సన్‌రైజర్స్ 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత సీజన్‌లో బ్రూక్ ఘోరంగా విఫలమయ్యాడు. 11 మ్యాచుల్లో ఒక శతకంతో కేవలం 190 పరుగులే చేశాడు. దీంతో బ్రూక్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం విడుదలే చేసింది. అలాగే సమర్థ్ వ్యాస్, కార్తిక్ త్యాగి, వివ్రంత్ శర్మ, అకీల్ హుస్సెన్, ఆదిల్ రషీద్‌లను కూడా సన్‌రైజర్స్ విడుదల చేసింది.
మరోవైపు కెప్టెన్ అయిడన్ మార్క్‌రమ్‌తో పాటు అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగట్, ఉపేందర్ సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కొ యోన్సేన్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, షాబాజ్ ఖాన్ (ఆర్సీబీ నుంచి), మయాంక్ మార్ఖండే, ఉమ్రాన్ మలిక్, ఫజల్ హక్ ఫారూఖీలను రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో రూ.34 కోట్లు ఉన్నాయని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీ ప్రకటించింది.
హార్దిక్ పాండ్యా గుజరాత్‌లోనే..
గత మూడు, నాలుగు రోజులుగా గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా ముంబైకి బదిలి అవుతున్నట్లు పుకార్లు ఊపందకున్నాయి. హార్దిక్ తిరిగి ముంబై ఇండియన్స్ జట్టులోకి రాబోతున్నాడని, అందుకోసం ముంబై ఫ్రాంచైజీ భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైందనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఇవన్ని ఉట్టి పుకార్లేనని టైటాన్స్ విడుదలచేసిన రిటైన్ జాబితాతో రుజువైంది. దీంతో పాండ్యాపై వచ్చిన పూకర్లకు బ్రేక్ పడింది.
ఇక ఈసారి మాత్రం ఆటగాళ్ల ట్రేడింగ్ జోరుగా సాగింది. కీలకమైన ఆటగాళ్లను కొన్ని జట్లు ఇచ్చుపుచ్చుకున్నాయి. మరికొన్ని ఫ్రాంచైజీలు కొందరూ ప్రముఖ ఆటగాళ్లను విడుదల చెస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నాయి. కేకేఆర్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధిక సంఖ్యల్లో ఆటగాళ్లను విడుదల చేసి అందరిని ఆశ్చర్యపరిచాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా 12 మందిని రిలీజ్ చేయగా.. బెంగళూరు ఫ్రాంచైజీ 11 మంది ఆటగాళ్లను విడుదలు చేసింది.
అలాగే కేకేఆర్ ప్రముఖ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, కివీస్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ, లూకీ ఫెర్గ్యూసన్‌లను విడుదలచేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆర్‌సీబీ కూడా ఆసీస్ స్టార్ పేసర్ హాజిల్‌వుడ్, డేవిడ్ విల్లే, ఫిన్ అలేన్‌లను రిలీజ్ చూస్తున్నట్లు ప్రకటించింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బెన్ స్టోక్స్ (16.25 కోట్లు), అంబటి రాయుడు (6.75 కోట్లు), కైల్ జేమీసన్ (1 కోటి)లను విడుదల చేసింది. అయితే అంబటి రాయుడు ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సీఎస్‌కేకు మరోసారి సారథ్యం వహించనున్నాడు. మహీ 15వ సారి కెప్టెన్‌గా ఎంపికవడం విశేషం.
ఐపీఎల్ 2024 ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్): హ్యారీ బ్రూక్, సమర్థ్ వ్యాస్, కార్తిక్ త్యాగి, వివ్రాంత్ శర్మ, అకీల్ హుస్సేన్, ఆదిల్ రషీద్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్): షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, ఆర్య దేశాయ్, డేవిడ్ వీజ్, నారాయణ్ జగదీశన్, మన్‌దీప్ సింగ్, కుల్వంత్ ఖజ్రోలియా, శార్ధుల్ ఠాకూర్, లూకీ ఫెర్గ్యూసన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, జాన్సన్ చార్లెస్.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (కెఎపిబి): భానుక రాజపక్స, మోహిత్ రాథీ, అగద్ బవా, షారుక్ ఖాన్, బాల్తేజ్ ధందా.
రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్): జో రూట్, అబ్దుల్ బసిత్, జాసన్ హోల్డర్, ఆకాశ్ వశిస్ఠ్, కుల్దిdప్ యాదవ్, ఒబెద్ మెక్‌కాయ్, మురుగన్ అశ్విన్, కేసీ కరియప్ప, కేఎం ఆసీఫ్.
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే): అంబటి రాయుడు (రిటైర్‌మెంట్), డ్వేన్ ప్రిటోరియస్, బెన్ స్టోక్స్, సుభ్రన్షూ సేనాపతి, సిసింద మగల, ఆకాశ్ సింగ్, కైల్ జేమీసన్, భగత్ వర్మ.
ఢిల్లి క్యాపిటల్స్: ముస్తాఫిజులర్ రహ్మాన్, రిలీ రాస్సొవ్, చేతన్ సకరియా, రొమన్ పొవెల్, మనీష్ పాండే, ఫిల్ సాల్ట్, కవ్లేష్ నాగర్ కోటి, రిపాల్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, అమాన్ ఖాన్, ప్రియమ్ గార్గ్.
గుజరాత్ టైటాన్స్: ప్రదీప్ సాంగ్వాన్, ఒడీన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దాసున్ శానక, యష్ దయాల్, కేఎస్ భరత్, శివం మావి, ఉర్విల్ పటేల్.
లక్నో సూపర్ గెయింట్స్: జయదేవ్ ఉనద్కాట్, డానియల్ సామ్స్, మానవ్ వొహ్రా, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, అర్పిత్ గులెరియా, సుర్యాంష్ షెద్దే, కరణ్ నైర్.
ముంబై ఇండియన్స్ (ఎమ్‌ఐ): పోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువన్ జాన్సెన్, రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్, క్రిస్ జోర్డన్, సందీప్ వారియర్, మహ్మద్ అర్షద్ ఖాన్, రమన్‌దీప్ సింగ్, హృతిక్ షౌకీన్, రాఘవ్ గొయల్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ): జోష్ హాజిల్‌వుడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, ఫిన్ అల్లెన్, మిచెల్ బ్రాస్‌వెల్, డేవిడ్ విల్లే, వైనె పర్నెల్, సొను యాదవ్, అవినాష్ సింగ్, సిద్దర్థ్ కౌల్, కేదర్ జాదవ్.