Saturday, November 23, 2024

రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.95 శాతం, 17 నెలల గరిష్టానికి సీపీఐ.. భారీగా పెరిగిన ఆయిల్‌, ఫుడ్‌ ధరలు

భారత్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 6.95 శాతంతో 17 నెలల గరిష్టానికి చేరుకుంది. ఫిబ్రవరి నెలలో 6.07 శాతంగా నమోదైంది. ఈ మేరకు మంగళవారం మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ డేటాను విడుదల చేసింది. కన్జ్యూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ (సీపీఐ) ద్రవ్యోల్బణం మార్చి నెలలో అంచనాలకు మించి ఉంది. ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెల 6 శాతం కంటే పైన నమోదైంది. జనవరి-మార్చి త్రైమాసికంలో సగటున 6.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఏప్రిల్‌-జూన్‌, జులై-సెప్టెంబర్‌ కాలంలో ఆర్బీఐ ఎంపీసీ అంచనాలను అందుకోలేకపోవచ్చు. 2022, జనవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.01 శాతంగా ఉండింది. 2021లో మార్చి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.52 శాతం ఉండగా.. ఫుడ్‌ ద్రవ్యోల్బణం 4.87 శాతంగా ఉండింది. ఫిబ్రవరిలో ఫుడ్‌ ద్రవ్యోల్బణం 5.85 శాతంగా ఉంది. 2022 జనవరిలో 5.43 శాతంగా ఉండింది.

అంచనాలు మించిన ద్రవ్యోల్బణం
ఏప్రిల్‌-జూన్‌ కాలంలో సీపీఐ ద్రవ్యోల్బణం 6.3 శాతం ఉండొచ్చు అని, జులై-సెప్టెంబర్‌ కాలంలో 5.8 శాతంగా ఉండొచ్చు అని ఆర్‌బీఐ తాజా అంచనాలను వెల్లడిస్తున్నాయి. మార్చి నెలలో దాదాపు అన్ని రంగాల్లో ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగింది. గత నెలలో కూరగాయలు, హౌసింగ్‌ ధరలు మాత్రమే స్వల్పంగా తగ్గాయి. ఫుడ్‌ ఇండెక్స్‌ ద్రవ్యోల్బణం మార్చిలో ఏకంగా 7.68 శాతానికి పెరిగింది. ఇదే గత ఫిబ్రవరి నెలలో 5.85 శాతంగా ఉండింది. ఇందులో సెరెల్స్‌, మీట్‌, ఫిష్‌, ఆయిల్‌, ఫ్యాట్స్‌, పల్సెస్‌ ధరలు పెరగ్గా.. కేవలం కూరగాయల ధరలు మాత్రమే తగ్గాయి. క్లాతింగ్‌, ఫుట్‌వేర్‌ ద్రవ్యోల్బణం 9.40 శాతానికి పెరిగింది. హౌసింగ్‌ మాత్రం 3.38 శాతానికి తగ్గింది. ఫ్యూయెల్‌, లైట్‌ ద్రవ్యోల్బణం 7.52 శాతానికి, మిస్‌లీనియస్‌ 7.02 శాతానికి పెరిగాయి. వంట నూనెకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఏకంగా 18.79 శాతం పెరిగింది. రాయిటర్స్‌ పోల్‌ అంచనా ప్రకారం.. 2022, మార్చిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.35 శాతం. కానీ ఈ అంచనా కంటే మించి పోయి 6.95 శాతంగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement