Tuesday, November 26, 2024

Resuts – సివిల్స్ లో అమ్మాయిలే టాప్ …తెలుగు విద్యార్ధుల జోరు..

న్యూ ఢిల్లీ – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2022 పరీక్ష తుది ఫలితాలను ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/లో తమ ఫలితాలను చూడవచ్చు. కాగా, సివిల్స్ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులను మహిళ అమ్మాయిలే కైవసం చేసుకన్నారు. సివిల్స్ 2022 టాపర్‌గా ఇషితా కిషోర్ నిలిచారు. గరిమా లోహియా.. రెండో ర్యాంకు, ఉమా హారతి.. మూడో ర్యాంకు, స్మృతి మిశ్రా.. నాలుగో ర్యాంకు సాధించారు.
ఇక, ఐఆర్‌టీఎస్ తిరిగి సివిల్ సర్వీసెస్‌లో చేర్చడంతో ఖాళీల సంఖ్య పెరిగింది. ఫలితంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2022 మెరిట్ లిస్ట్‌లో మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక, యూపీఎస్సీ సివిల్స్ 2022 ప్రిలిమినరీ పరీక్ష గతేడాది జూన్ 5న నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు జూన్ 22న విడుదలయ్యాయి. మెయిన్ పరీక్ష సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు నిర్వహించారు. ఫలితాలు డిసెంబర్ 6న రాగా,. ఇంటర్వ్యూలు మే 18న ముగిశాయి. నేడు ఫలితాలు విడుదలయ్యాయి..

సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల విజయభేరి
సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మరోసారి ప్రతిభ చూపారు.. మొత్తం పలితాలలో 100 మందికి పైగా తెలుగు విద్యార్ధులు మంచి ర్యాంకుల సాధించారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్‌ దత్తాకు 22వ ర్యాంకు సాధించారు. ఇక,  శ్రీసాయి అర్షిత్ 40వ ర్యాంకు, ఆవుల సాయికృష్ణ 94వ ర్యాంకు, శివమారుతిరెడ్డి 137వ ర్యాంకు, వసంత్ కుమార్ ఆర్ 157వ ర్యాంకు, కమతం మహేష్ కుమార్ 200, ఆర్ జయసింహారెడ్డి 217వ ర్యాంకు, బీ ఉమహేశ్వరరెడ్డి 270వ ర్యాంకు, చల్లా  కల్యాణి 285 ర్యాంకు, పీ విష్ణువర్దన్ రెడ్డి 292వ ర్యాంకు, జీ సాయికృష్ణ 293వ ర్యాంకు, లక్ష్మి సుజిత 311, ఎన్ చేతనా రెడ్డి 346,  శృతి యారగంటి ఎస్ 362వ ర్యాంకు, వై సుష్మిత 384వ ర్యాంకు సాధించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement