Modi | ‘మన్ కీ బాత్’ పునఃప్రారంభం.. ఐడియాల కోసం ప్రధాని పిలుపు!

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి చేసే రేడియో ప్రసంగం మన్‌ కీ బాత్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కాగా, ఈ కార్య‌క్ర‌మం మళ్లీ మొదలు కానుంది. జూన్‌ 30న 111వ ఎపిసోడ్‌తో ఈ కార్యక్రమం పునఃప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. MyGov ఓపెన్‌ ఫోరమ్‌, NaMo యాప్‌ లేదా 1800 11 7800 ఫోన్‌ నంబర్‌ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను పంచుకోవాలి అని ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ సూచించారు.

Exit mobile version