రాజస్థాన్ లో కాంగ్రెస్ ఓటమి దిశగా పయనిస్తున్నది.. 200 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.. అధికార కాంగ్రెస్ , విపక్ష బిజెపి మధ్య హోరాహోరి పోరు సాగింది.. ఇందులో బిజెపి ఆధీక్యం సాధించింది.. రాజస్థాన్ రాష్ట్రంలో ఓటర్లు సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా ఒక పార్టీ రెండు సార్లు అధికారంలోకి రాలేదు. ఈ సారి కూడా అదే విధంగా రాజస్థాన్ ఓటర్లు తీర్పు ఇచ్చారు. రాజస్థాన్ రాష్ట్రంలో 199 స్థానాలకు గానూ.. 112 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. ఇక కాంగ్రెస్ 75 స్థానాలకే పరిమితమైంది. బీఎస్పీ ఒక చోట, ఇతరులు 11చోట్ల లీడింగ్ లో ఉన్నారు. దాదాపుగా ఈ రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ ఖాతాలో చేరే అవకాశం ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement