మూడు విడతలుగా నిర్వహించిన జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. దశాబ్దం తర్వాత ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటరు ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ జోడీకే జై కొట్టాడు.
90 సీట్ల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ అయిన 46 సీట్లను ఇండియా కూటమి ఇప్పటికే సాధించింది. 52 సీట్లలో కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీకి ఇక్కడ 21 స్థానాలలో లీడింగ్ లో ఉంది.