Tuesday, October 8, 2024

Results – హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ సునామీ…

ఊహించినట్టే- హర్యానాలో కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టిస్తోంది. ప్రారంభ ఫలితాల్లో భారీ ఆధిక్యతను సాధించింది.

ఓటింగ్ మొత్తం ఏకపక్షంగా సాగిందంటూ ఇదివరకే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తాజా ఫలితాలు నిజం చేసేలా కనిపిస్తోంది

- Advertisement -

హర్యానాలో ఈ నెల 5వ తేదీన ఒకే విడతలో 90 చొప్పున నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది.ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ- దూసుకెళ్తోంది.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేేసే దిశగా అడుగులు వేస్తోంది. తొలి గంటలోనే భారీ మెజారిటీని సాధించింది. తొలి గంటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొత్తం 63 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు.భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉంది. ఏ మాత్రం కూడా పోటీ ఇవ్వలేకపోతోంది. తొలి గంటలో బీజేపీ 21 స్థానాల్లో ఆధిక్యతను సాధించింది.

ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ అభ్యర్థులు ఆరు చోట్ల లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత పెరుగుతూనే పోతోంది తప్ప ఎక్కడే గానీ తగ్గట్లేదు.

అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ- జన్‌నాయక్ జనతా పార్టీ సంకీర్ణ కూటమికి ఓటమి తప్పదంటూ ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా వీస్తుందని అంచనా వేశాయి. 70 సీట్లను తాము గెలుచుకోబోతున్నామంటూ తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కైథల్ అభ్యర్థి ఆదిత్య సూర్జేవాలా ధీమా వ్యక్తం చేశారు

.ఈ పరిణామాల మధ్య దేశ రాజధానిలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటోన్నారు. వాళ్ల రాకతో పార్టీ కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఫొటోలను ముద్రించిన టీషర్టులు ధరించి భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. డోలు మోగిస్తూ సందడి చేస్తోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement