Sunday, September 8, 2024

Results – అరుణాచల్ ప్రదేశ్‌లో మళ్ళీ బీజేపీకే పట్టం

అరుణాచల్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పెమా ఖండూ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికే మరోసారి ప్రజలు పట్టం కట్టారు. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసి విజయం ఢంకా మోగించింది. 60 సీట్లలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్లు గెలిచింది. మరో 14 స్థానాల్లో అధిక్యంలో ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.

‘సీఎం మెమాఖండు నేతృత్వంలోఅరుణాచల్ ప్రదేశ్‌కి తొలిదశలో భాగంగా ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో 10 సీట్లలో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందువల్ల మిగతా 50 సీట్ల ఫలితాలకు కౌంటింగ్ జరుగుతోంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసి, 41 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 34 స్థానాల్లోనే పోటీ చేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటే కనీసం 31 స్థానాలు గెలవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement