Tuesday, November 26, 2024

ఆలయాల్లో కరోనా ఆంక్షలు

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటోంది. లాక్ డౌన్, కర్ఫ్యూలను విధించి
ప్రజలను ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలను చేపట్టింది. రద్దీ ప్రదేశాలు, ప్రాంతా లలో కొన్ని నిబందనలను అవులు చేస్తోంది.

అందులో భాగంగానే దైవదర్శనం కోసం ఆలయాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధన కొనసాగిస్తూనే దర్శనాలకు అనుమతించింది. 10 ఏళ్ళలోపు పిల్లలు, 65 ఏళ్ళు దాటిన వృద్ధులకు ఆలయాల్లోకి అనుమతించరాదని పేర్కొంది. ప్రతి టెంపుల్ లో మాస్క్ పెట్టుకున్న భక్తులకు… థర్మల్ స్కానింగ్ చేసిన తరువాతే లోనికి అనుమతించాలని, ఎలాంటి అనుమానంవచ్చినా దేవాలయం లోనికి అనుమతించరాదని పేర్కొంది. అదే విధంగా ప్రత్యేక పూజల పేరుతో ఎక్కువ సంఖ్య లో భక్తులను గుడిలోపల ఉంచరాదని, కోవిడ్ నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో భక్తులను గుడిలోపల ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement