Friday, November 22, 2024

రష్యా ప్రసారాలపై ఆంక్షలు.. వ్యతిరేక వార్తలు రాస్తే జైలుకే.. పుతిన్‌ సరికొత్త చట్టం

రష్యా ప్రసార మాధ్యమాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్‌ వార్తలను రష్యాలో బ్లాక్‌ చేస్తున్నట్టు రష్యా కమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ తెలిపింది. ఈ విషయాన్ని ఇంటర్‌ఫాక్స్‌ వార్తా సంస్థ తెలిపింది. పుతిన్‌ తమ దేశానికి వ్యతిరేకంగా వార్తా ప్రసారాలు చేస్తే.. వారికి జైలు శిక్ష అంటూ పుతిన్‌ సర్కార్‌ ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. రష్యన్లను కించపర్చినట్టు, ఇతర వీడియోలను ప్రసారం చేయకూడదని, ఇక కొత్త రష్యా చట్టాల ప్రకారం.. రష్యా మిలటరీని కించపరిచే విధంగా ఏ వార్త అయినా.. వీడియో అయినా ప్రసారం చేస్తే.. చట్టవిరుద్ధంగా పరిగణిస్తామని తెలిపింది. ఇలాంటి వార్తలు బహిరంగపర్చడం నేరమంటూ నిబంధనలో మార్పు చేసింది. రష్యా ఉక్రెయిన్‌ దాడిపై ఫేక్‌ వార్తలను అరికట్టడానికి పుతిన్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement