నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి కోరారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి రెండవ తేదీ వరకు ఆంక్షలు విధించిందన్నారు. ఈనెల 31న రాత్రి పెద్దపెల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలతోపాటు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
బ్రీత్ అనలైజర్ లతో తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని, వీధుల్లోకి రావద్దన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో ర్యాలీలను ప్రభుత్వం నిషేధించిందన్నారు. నిబంధనలు ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవని తెలిపారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital