గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్షణమే అమల్లోకి వచ్చే ఈ ఆంక్షలు జనవరి 26 వరకూ అమల్లో ఉంటాయని తెలిపింది. ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ ఎటువంటి విమానాలకు అనుమతి లేదని ఈ మేరకు నోటీసులు వెలువరించింది.
రిపబ్లిక్ డే వేడుకలను దృష్టిలో ఉంచుకుని భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, బీఎస్ఎఫ్ వంటి భద్రతా బలగాల హెలికాప్టర్లు, విమానాలు లేదా గవర్నర్లు, ముఖ్యమంత్రులు ప్రయాణించే విమానాలకు మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదు.