Wednesday, November 20, 2024

మిడ్​ డే మీల్స్​ని మళ్లీ ప్రారంభించాలే.. పార్లమెంట్​లో సోనియా గాంధీ

కొవిడ్-మహమ్మారి సమయంలో పాఠశాలల్లో నిలిపివేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం కేంద్రాన్ని కోరారు. జీరో అవర్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. మూడేళ్లలోపు పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు వేడిగా వండిన ఆహారాన్ని అందుబాటులో ఉంచాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. మహమ్మారి సమయంలో పిల్లలు ఎక్కువగా నష్టపోయారని సోనియా అన్నారు. ఎందుకంటే పాఠశాలలు మూసివేసినప్పుడు మధ్యాహ్న భోజన పథకం కూడా ఆపేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ప్రజలకు పొడి రేషన్లు అందజేశారు. కానీ, పిల్లలకు, పొడి రేషన్ ప్రత్యామ్నాయం కాదు. వండిన, పోషకాహార భోజనం అందించడమే మంచిది అని సోనియా చెప్పారు.

మహమ్మారి సమయంలో పిల్లలు, వారి కుటుంబాలు కష్ట సమయాలను ఎదుర్కోవలసి వచ్చిందనేది నిజమేనని అన్నారు. కానీ ఇప్పుడు పిల్లలు పాఠశాలకు తిరిగి వస్తున్నారు. వారికి మంచి పోషకాహారం అందించాలి. మహమ్మారి సమయంలో మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి మధ్యాహ్న భోజనం కూడా సహాయపడుతుంది. అని సోనియా గాంధీ చెప్పారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) 2019-21 ప్రకారం, 2015-16తో పోల్చితే ఐదేళ్లలోపు పోషకాహార లోపం, తక్కువ బరువు ఉన్న పిల్లల శాతం పెరిగిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement