కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ మ్యాచులు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
గతంలో పలు సందర్భాల్లో యూఏఈలో మ్యాచ్‌లు విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ అధికారులు యూఏఈ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 2014 లీగ్‌లో మొదటి 20 మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం ఇచ్చింది. కరోనా కారణంగా 2020 సీజన్ కూడా యూఏఈలోనే పూర్తయింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌ల తర్వాత కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడింది. మొత్తం 60 మ్యాచ్‌లలో 31 మ్యాచ్‌లు ఇంకా జరగాల్సి ఉంది. కాగా కొత్త ఐపీఎల్ వేదిక, తేదీలను బీసీసీఐ ఈ నెల 29న ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనుంది.