Friday, November 22, 2024

ఆంధ్రప్రభ కథనానికి స్పంద‌న‌.. బతుకమ్మ కల్వర్టు వద్ద రోడ్డు నిర్మాణం

కంది, (ప్రభ న్యూస్) : సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యల్ – ఇంద్రకరణ్ వరకు వేళ్ళు ప్రధాన రహదారి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. అయితే 30వతేదిన గురువారం కల్వర్టు పనుల్లో జాప్యం అని ఆంధ్ర‌ప్ర‌భ‌లో కథనం వ‌చ్చింది. వన్‌ వేగా ఉన్న ఈ రహదారి మీదుగా నిత్యం భారీ వాహనాలు వెళ్తుంఆయి. సమీపంలో పారిశ్రామిక వాడ ఉండడం, రాత్రి పగలు తేడాలేకుండా రోజుకు వేలలో వాహనాలు తిర‌గ‌డంతో రోడ్లు మొత్తం డ్యామేజీ అయ్యి. ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు కూడా ఈ దారి మీదుగానే జాతీయ రహదారికి చేరుకుంటాయి.

ఇక్కడ కల్వర్టు నిర్మాణం కొరకు కొద్దిరోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్ట‌ర్‌ నిర్లక్షం వల్ల ప‌నులు జ‌ర‌గ‌డం లేదు. దీంతో పంట పొలాల్లో పని చేసుకునే రైతులకు కూడా ఈ రోడ్డు మీదుగా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టు పనుల్లో భాగంగా రోడ్డుగా విస్తరించేందుకు కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో రెండు నెలలుగా పనులు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా కాంట్రాక్టర్‌ రహదారికి ఇరువైపులా దాదాపు రెండు మీటర్ల వెడల్పుతో ప్రొక్లెయిన్‌ తో మట్టిని తొలగించే పనులు నిర్వహిస్తున్నాడు.

ఈక్రమంలో రహదారిపై ఎలాంటి సైన్‌ బోర్డులు, హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయ‌లేదు. దీనిపై వరుస కథనాలు ప్రచురించడంతో స్థానిక పెద్దలు, సర్పంచ్ చొరవ తీసుకుని అధికారులు కలిసి ప్రమాదాలు జరగకుండా మొరంతో మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. ఆంధ్ర‌ప్ర‌భ వార్త‌లు, క‌థ‌నాల‌తోనే రోడ్డు నిర్మాణం జ‌రిగింద‌ని ప్రయాణికులు , గ్రామస్తులు సంతోషం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement