హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు.. తాజా ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఆయన ఫలితాలు వెలువడుతున్న తరుణంలో రాజీనామాకు సిద్దమయ్యారు.. ప్రగతి భవన్ నుంచి ఆయన ఎటువంటి కాన్వాయ్ లేకుండా తన స్వంతకారులో రాజ్ భవన్ కు వెళ్లారు.. అక్కడ గవర్నర్ తమిళి సై కు కెసిఆర్ తన రాజీనామా లేఖను అందజేశారు… గవర్నర్ వెంటనే ఆ రాజీనామాను ఆమోదించారు..అలాగే కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ ఆపదర్మ ప్రభుత్వాన్ని కొనసాగించవలసిందిగా కెసిఆర్ ను కోరారు.. ఇదిఇలా ఉంటే రేపు జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని రద్దు చేశారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement