Monday, November 25, 2024

Breaking: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా

మ‌ళ్లీ క్రీయాశీల రాజ‌కీయాల‌లో త‌మిళ నేత‌
త‌మిళ‌నాడు నుంచి లోక్ స‌భ‌కు పోటీకి రెడీ
గ‌తంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలిగా పార్టీకి సేవ‌లు
రెండు సార్లు పోటీ చేసి ఓట‌మి
మూడోసారి అదృష్టాన్నిప‌రిక్షించుకుంటున్న నేత

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై రాజీనామా చేశారు. రాష్ట్రపతికి రాజీనామా లేఖను తమిళిసై పంపారు. తెలంగాణ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తమిళిసై కొనసాగుతున్నారు. ఇటు తెలంగాణ గవర్నర్ గా, అటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కొనసాగుతున్న ఆమె, ఇవాళ రెండు పదవులకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.

త‌మిళ‌నాడు నుంచి లోక్ స‌భ బ‌రిలోకి..

చెన్నై సెంట్రల్‌ నుంచి బీజేపీ ఎంపీ టికెట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. కన్యాకుమారి.. తమిళిసై సొంత జిల్లా.. పైగా కన్యాకుమారి, తిరునల్వేలి, చెన్నై సెంట్రల్‌ స్థానాల్లో ఒక స్థానం నుంచి ఏదో ఒక స్థానంలో తమిళిసై పోటీ చేయనున్నారు. గతంలో తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో రెండుసార్లు ఓటమి పాలయ్యారు. 2009లో తొలిసారి చెన్నై నార్త్ నుంచి పోటీ చేసిన ఆమె.. 2019లో తూత్తుకుడి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగినా ప్రజలు ఆదరించలేదు. అయితే, ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీజేపీ నాయకత్వం ఆమెను తమిళనాడు గవర్నర్‌గా నియమించింది. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులై అదనపు బాధ్యతలు అప్పగించింది. తమిళిసై సౌందర రాజన్ తండ్రి కాంగ్రెస్ పార్టీ. అయితే తమిళిసై సౌందర రాజన్ బీజేపీలో చేరారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేసేందుకు తమిళిసై సౌందర రాజన్ తీవ్రంగా శ్రమించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement