Sunday, September 22, 2024

ACA | కౌన్సిల్ సభ్యుల రాజీనామా ఆమోదం..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో గడిచిన ఐదు సంవత్సరాలుగా చక్రం తిప్పిన కౌన్సిల్ సభ్యుల రాజీనామాకు ఆమోదం లభించింది. గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని తామే అయ్ నడిపించి, ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడు పి.రోహిత్ రెడ్డి, కార్యదర్శి ఎస్ ఆర్ గోపీనాథ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాకేష్, ట్రెజరర్ ఏవి చలం, కౌన్సిలర్ పురుషోత్తం రాజీనామాలను ఆమోదిస్తూ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

విజయవాడలోని ఒక హోటల్లో సమావేశమైన ఏసీఏ సర్వసభ్య సమావేశంలో సభ్యులు అతి త్వరలోనే ఏసీఏకు జరిగే ఎన్నికలకు సంబంధించి వివరాలను పూర్తిస్థాయిలో చర్చించారు. ప్రస్తుతం కార్యవర్గ రాజీనామాలను ఆమోదించిన సభ్యులు అతి త్వరలోనే నిర్వహించే ఎన్నికలకు సంబంధించి అధికారిగా మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను నియమిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

పాత బోర్డులోని సభ్యుల రాజీనామాలను ఆమోదించినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, కర్నూలు క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ విలేకరులకు తెలిపారు. మరో నెల రోజుల్లో ఏసీఏకు పూర్తిస్థాయిలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపిన ఆయన అంతవరకు ప్రతిరోజు ఏసీఏ కార్యకలాపాలకు ఎటువంటి ఆటకం కలగకుండా త్రిషభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

కమిటీలో ఆర్ వి ఎస్ రంగారావు, మాజీ మంత్రి మ్యానుఫరల్ జాగర్లమూడి మురళీమోహన్రావు, సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఇదే సమావేశంలో తాజా క్రికెట్ ఆటలపై చర్చించడంతోపాటు స్టేడియం నిర్మాణ ప్రగతి వాటి ప్రస్తుత పరిస్థితి క్రీడాకారులకు అందుతున్న సదుపాయాలను పై చర్చించినట్లు పేర్కొన్నారు. అలాగే పలువురు క్రీడాకారులు ప్రముఖుల నుండి సలహాలను సూచనలను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు.

ఈ సర్వసభ్య సమావేశంలో విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తో పాటు వివిధ జిల్లాలకు చెందిన క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు క్లబ్ నెంబర్లు క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement