Tuesday, November 26, 2024

మళ్లీ వాయిదాపడ్డ రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ భేటీ.. సెప్టెంబరు 2న నిర్వహణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ ) సమావేశం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా పడింది. కమిటీ సమావేశం వాయిదా పడడం ఇది రెండోసారి. నదీపై ఉన్న రిజర్వాయర్ల నుంచి తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదల, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ రిజర్వాయర్లలో నీటి మట్టాల నిర్వహణ (రూల్‌ కర్వ్‌ ), జలవిద్యుదుత్పత్తి, శ్రీశైలం లో కనీస నీటి మట్టం నిర్వహణ తదితర అంశాలపై చర్చించేందుకు మంగళవారం సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఏపీ అధికారులు ఇరిగేషన్‌ పనుల్లో బిజీగా ఉన్నామని సమాచారం అందించడంతో సమావేశాన్ని వచ్చే నెల రెండుకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్ర్‌ాల ఈఎన్‌సీల నేతృత్వంలో ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement