Monday, November 25, 2024

Big story | నదీలోనే జలాశయం.. 50,500 ఎకరాలకు సాగునీరు, శరవేగంగా పంపు హౌజ్‌ల నిర్మాణాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సింధు, గంగ వంటి జీవనదుల తీరాల్లో విలసిల్లిన నాగరికతే చరిత్ర, అయితే కాలగమనంలో జీవనదులు ప్రవహిస్తూన్నా పంటపొలాల్లోకి నీరు అందని పరిస్థితి నెలకొంది. మహాజన పదాలు పురుడు పోసుకున్న జీవనదుల ప్రవాహాలు సముద్రాలకే పరిమితం కాగా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు వరుణుడి కటాక్షంకోసం ఆకాశాన్ని చూడటం పరిపాటైంది. ఈనేపథ్యంలో అత్యంత ప్రాచీన చరిత్ర పురుడు పోసుకున్న ఆదిలాబాద్‌ లోని మారుమాల ప్రాంతాల తలాపు నుంచి పెన్‌ గంగా పారుతున్నా నీటికోసం తల్లడిల్లిన రైతుల వెతలను తీర్చేందుకు దశాబ్దాలుగా పెండింగ్‌ లో ఉన్న చనాకా-కొరాట బ్యారేజ్‌ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ చేసిన ప్రయత్నం ఫలించి, అనుమతులన్నిటితో పనుల్లో వేగం పుంజుకుంది… నదీపరివాహక ప్రాంతాల్లో విరాజిల్లిన సంస్కృతి భారతదేశ చరిత్రని సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు రొమిలా థాపర్‌ చెప్పిన మాటలు అక్షర సత్యాలు, అయితే పరివాహక ప్రాంతాల్లోని రైతులకు నీటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వలసలు పెరిగి అభివృద్ధి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో చనాకా కొరాట బ్యారేజీ నిర్మాణంతో ఆదిలాబాద్‌ గిరిజన ప్రాంతాలను పెన్‌ గంగా జలాలుపునీతం చేయనున్నాయి.

పెన్‌ గంగా నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి నిర్మిస్తున్న చనాకా కొరాట ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతించడంతో పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆధికారులను ఆదేశించింది. అయితే బ్యారేజ్‌ పనుల్లో మరో 20 శాతం పూర్తి కావల్సి ఉంది. అలాగే పంపులను బిగించే పనులు పూర్తి చేసేందుకు సాగునీటి పారుదల శాఖ సిద్ధమైంది. చనాకా-కొరాట బ్యారేజ్‌ పంప్‌ హౌజ్‌లు, కాలువల నిర్మాణానికి 2015లో రూ. 1227కోట్లు, గ్రావిటీ కాలువ నిర్మాణం కోసం రూ. 368 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చిపనులు ప్రారంభించినప్పటికీ కేంద్ర అనుమతులు లభించకపోవడంతో జాప్యం జరిగింది. ప్రెషర్‌ పైపుల ద్వారా ఎత్తిపోసే నీటి ద్వారా తాంసీ, భీంపూర్‌ మండలాల్లోని 14 గ్రామాల్లో 13,500 ఎకరాలకు సాగునీటితో 51వేల 500 ఎకరాలకు సాగునీటి సౌకర్యం లభించనుంది. మహారాష్ట్ర 6 గ్రామాల్లో 3వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అయితే బ్యారేజ్‌ పనులను 2016 లో మొదలై 2020 నాటికి పూర్తి అయినప్పటికీ కేంద్ర అనుమతులు రాకోవడంతో పైపు పనులు, పంపుహౌజ్‌ పనులు, నీటి నిల్వ లో ఆలస్యం అయింది.

- Advertisement -

ఇక బ్యారేజ్‌ వివరాల్లోకి వెళ్లితే జలాశయం నదీలో 28 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టుకు 23 గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. నీటి నిల్వ నదీలోనే ఉండటంతో ముంపు గ్రామాల సమస్యే లేదు. అలాగే ఆరుపంపుల్లో మూడుపంపులు 5.5 మెగావాటచ్లు, 3 పంపులు 12 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రాజీవ్‌ దుమ్ము గూడెం ప్రాజెక్టు కోసం విదేశాలనుంచి తెప్పించిన పంపులను ఈ ప్రాజెక్టుకోసం వాడుతున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌, పంపు హౌజ్‌, సబ్‌ స్టేషన్నలు, గ్రావిటీ కాలువ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 4జనవరి 22న నీటిలభ్యత, 20జనవరి 2022, అతరరాష్ట్ర అనుమతి 4జనవరి 2021, నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు అనుమతి,23సెప్టెంబర్‌2019 పర్యావరణ అనుమతి,29 నవంబర్‌ 2022న కేంద్ర సాంకేతిక సలహా కమిటీ అనుమతి లభించగా తాజాగా 13జనవరి 2023న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతి లభించడంతో ప్రాజెక్టుకు పూర్తిస్థాయి అనుమతులు లభించాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో 4దశల్లో జరిగిన మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణతో 75వేల ఎకరాల సాగువిస్తీర్ణం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బోద్‌, బజార్‌ హత్నూర్‌, చింతల్‌ బోరీ, కేస్లా గూడ చిన్ననీటి పారుదల ప్రాజెక్టులతో వ్యవసాయ భూములకు నీరు అందించడంతో పాటుగా చనాకా-కొరాటబ్యారేజ్‌ తో 51వేల 500ఎకరాల్లో పెన్‌ గంగాజలాలు ప్రవహించి సస్యశ్యామలం చేయనున్నాయి. ఎండిన చేళ్లలో పసిడి పంటలు పండే అవకాశం ఏర్పాడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement