Friday, November 22, 2024

పదోన్నతుల్లో రిజర్వేషన్లు.. రాష్ట్రాలదే బాధ్యత : సుప్రీం కోర్టు

ప్రభుత్వ ఉద్యోగుల్లో ప్రమోషన్లకు సంబంధించి ఎస్‌సీ, ఎస్‌టీ రిజరేషన్ల బాధ్యత ప్రభుతానిదే అని, ఈ నిబంధనలను నిర్వీర్యం చేయలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్‌ నాగేశ్వర్‌ రావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. విచారించింది. ఇందుకోసం సరికొత్త ప్రమాణాలను నిర్దేశించలేమని పేర్కొంది. ఉద్యోగపరమైన పదోన్నతుల్లో.. ఎస్‌సీ, ఎస్‌టీలకు న్యాయం జరగడం కోసం తామేమీ కొత్త నిబంధనలు తీసుకురాలేమని తేల్చి చెప్పింది. ఈ బాధ్యత వివిధ రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ చెప్పుకొచ్చింది. ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజరేషన్లను అమలు చేసే ముందు కేడర్‌ వారీగా ఉద్యోగుల ఖాళీల లెక్కలు తీసుకోవాలని సూచించింది. ఆయా రాష్ట్ర ప్రభుతాలే విధిగా సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

వివిధ రాష్ట్రాల నుంచి దాఖలైన 133 వ్యాజ్యాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఎస్‌సీ, ఎస్‌టీ తెగలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతిలో రిజరేషన్లు కల్పిస్తూ.. ఇచ్చిన తీర్పుపై చర్చను పున:ప్రారంభించేందుకు సిద్ధంగా లేమని సుప్రీం ధర్మాసనం గతంలోనే అభిప్రాయపడింది. జస్టిస్‌ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ అంశంపై జూన్‌ 2018లో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి మార్గాలను కనుగొనడం రాష్ట్ర ప్రభుతాలపై ఆధారపడి ఉందని కోర్టు పునరుద్ఘాటించింది. 2018లో 58 పేజీల తీర్పులో కీలక విషయాలను ప్రస్తావించింది. అప్పటి సీజేఐ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. 2006 నాటి తీర్పును సవరించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement