న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో జరుగుతున్న నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ సాయుధ బలగాల్లో నియామకాలు కులం ప్రాతిపదికన జరగదని చెప్పారు.
అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా వెనకబడ్డ తరగతులకు కల్పించిన రిజర్వేషన్ ప్రాతిపదికపైనే ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుందని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాల కోటాలో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఖాళీలను తదుపరి నిర్వహించే నియామకంలో భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.