Tuesday, November 19, 2024

తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్

తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 30న తెలంగాణలోని రెండు కార్పొరేషన్‌లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 16 నుంచి నామినేషన్‌ల స్వీకరణ జరగనుండగా.. ఈనెల 30న పోలింగ్ జరుగుతుంది. మే 3న ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

కాగా ఎన్నికలు జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వరంగల్ పరిధిలో 66 డివిజన్లకు గానూ 5 డివిజన్లు ఎస్సీ మహిళలకు, ఎస్సీలకు-6, ఎస్టీ-1, ఎస్టీ మహిళ-1, బీసీ మహిళలకు-10, బీసీ జనరల్-10, జనరల్ మహిళలకు 16 డివిజన్లు కేటాయించారు. వరంగల్‌లో 878 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అటు ఖమ్మంలో 60 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్ వివరాలు..

బీసీ ఉమెన్: 38, 42, 9, 16, 23, 33, 36, 32, 25, 54

ఎస్టీ ఉమెన్: 65

- Advertisement -

ఎస్టీ జనరల్: 2

ఎస్సీ ఉమెన్: 43, 46, 1, 3, 14

బీసీ జనరల్: 10, 12, 26, 6, 41, 39, 40, 21, 34, 20

ఎస్సీ జనరల్: 18, 15, 17, 53, 47, 37

జనరల్ ఉమెన్: 29, 48, 63, 55, 50, 57, 30, 44, 64, 28, 58, 49, 11, 8, 19, 24, 59

జనరల్: 62, 22, 31, 45, 51,13, 27, 4, 7, 61, 35, 66, 60, 52, 56, 5

Advertisement

తాజా వార్తలు

Advertisement