మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని, మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైంది కాదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేస్తున్న దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమన్నారు.మంత్రి మహిళా బిల్లుకు మద్దతు ప్రకటించిన బీజేపీకి అవకాశం ఇచ్చి ఎనిమిదేండ్లు దాటిపోయిందని మండిపడ్డారు. ఇంకా బిల్లు మాత్రం లోక్‌సభ ముందుకు రాలేదన్నారు. ఇప్పటికైనా బీజేపీ కళ్లు తెరవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రకాలుగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వం బంజారాలకు స్వర్ణయుగమని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement