సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీలు బయటకు వచ్చేందుకు రోజురోజుకూ ఎదురుచూపులు పెరుగుతూనే ఉన్నాయి. కార్మికులకు, రెస్క్యూ టీమ్‌కు మధ్య 60 మీటర్ల దూరం ఉండగా అందులో 47 మీటర్లు డ్రిల్లింగ్ చేయగా 12 నుంచి 13 మీటర్ల తవ్వకం మిగిలి ఉంది. ఈ 12 మీటర్లు తవ్వే క్రమంలో ఆగర్ మెషిన్ బ్లేడ్ దెబ్బతిన్నది. కూలిన శిధిలాలు తొలగిస్తున్న క్రమంలో ఐరన్ రాడ్స్ అడ్డురావడంతో డ్రిల్లింగ్ బ్లేడ్స్ ముక్కలయ్యాయి.. దీంతో పనులు నిలిపివేశారు..
దీంతో ఇప్పుడు ప్లాన్ బిపై పని జరుగుతుంది. నేటి నుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు.. అదీ కాకుండా మ్యాన్యువల్ పద్దతిలో టన్నెల్ పైన ఉన్న పర్వత భాగాన్ని తవ్వుతున్నారు.. నేటి ఉదయం నుంచి వర్టికల్ డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు.. , అయితే ఈ ప్లాన్ ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయడానికి కనీసం వారం రోజులు సమయం పట్టవచ్చని చెబుతున్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సభ్యుడు సయ్యత్ అటా హస్నైన్ మాట్లాడుతూ.. తదుపరి రెస్క్యూ ఆపరేషన్ మాన్యువల్‌గా జరుగుతుంది కాబట్టి, దీనికి చాలా సమయం పట్టవచ్చు. అయినప్పటికీ, కార్మికులు సురక్షితంగా ఉన్నారు. వారు కూడా వారి కుటుంబాలతో నిరంతరం మాట్లాడుతున్నారు. మరోవైపు, కార్మికులు వారి కుటుంబాలతో మాట్లాడటానికి వీలుగా టెలిఫోన్ కమ్యూనికేషన్ కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి. దీనిలో బిఎస్ ఎన్ ఎల్ సొరంగం లోపల వైర్లు వేసి ల్యాండ్‌లైన్ ఫోన్‌లను అమర్చింది. ఇక నిరంతరం వారికి ఆహారం, మందులు అందజేస్తున్నారు.. లోపలి వారిని ఎప్పటికప్పుడు సిసిటివి ద్వారా పర్యవేక్షిస్తున్నారు..