జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 2024లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఆహ్వానం అందింది. కాగా, రిపబ్లిక్ పరేడ్‌కు మరో నెల రోజుల సమయం ఉండడంతో గణతంత్ర దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
జూలై నెలలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సమావేశమయ్యారు. బాస్టిల్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఫ్రాన్స్ వెళ్లారు. పరేడ్‌లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు.
ప్రధాని మోడీని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్వయంగా ఆహ్వానించారు. భారతదేశం – ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోడీ ఫ్రాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మిలిటరీ బ్యాండ్ నేతృత్వంలోని 241 మంది సభ్యులతో కూడిన ట్రై-సర్వీస్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కవాతులో పాల్గొంది. ఈ నేపథ్యంలోనే మాక్రాన్ ను రిపబ్లిక్ వేడుకలలో పాల్గొనవలసిందిగా స్వయంగా మోడీ ఆహ్వానం పంపారు.. దీనికి ఆయన అంగీకరించారు..