న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ:దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
కర్తవ్యపథ్‌లో నిర్వహించిన ఈ గణతంత్ర దినోత్సవ కవాతు వేడుకల్లో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక ప్రత్యేక శకటాన్ని ప్రదర్శించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం 31శకటాలు ఈ ఏడాది పరేడ్‌లో పాల్గొన్నాయి..
“స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్” అనే థీమ్‌తో రూపొందించిన ఈ శకటాలు భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని, సైనిక శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించాయి.త్రివిధ దళాల గౌరవ వందనం..రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి సంయుక్త శకటాన్ని ప్రదర్శించాయి. భూమి, ఆకాశం, సముద్రంలో జరిగే యుద్ధాలకు సంబంధించిన దృశ్యాలతో రూపొందించిన ఈ శకటం ఈ పరేడ్‌లో హైలైట్‌గా నిలిచింది.
సైనిక శక్తిని ప్రదర్శించేందుకు బ్రహ్మోస్ క్షిపణి, పినాకా రాకెట్ లాంచర్, ఆకాశ్ క్షిపణులు, యుద్ధ ట్యాంకులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డీఆర్డీఓ రూపొందించిన “ప్రళయ్” క్షిపణి తొలిసారి ప్రదర్శనలో అదుర్స్ అనిపించింది.కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి..పరేడ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రూపొందించిన 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి మరో 15 శకటాలు ప్రదర్శించబోతున్నారు.
రాష్ట్రపతి భవన్ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉన్న ఎర్రకోట వరకు మొత్తం 31 శకటాలు ఈ గణతంత్ర వేడుకల్లో పరేడ్ చేశాయి గణతంత్ర వేడుకలలో 5,000 మంది కళాకారులు వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం ప్రత్యేక ఆకర్షణఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ ఘనతను ప్రపంచానికి తెలియజేస్తున్న విలక్షణ కళాఖండాలు. సాధారణ కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు, నాణ్యత, సౌందర్యంతో దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకతకు గుర్తుగా నిలుస్తున్నాయి. నునుపుగా, నాజూగుగా ఉండే ఈ బొమ్మలు, చిన్నారుల చేతుల్లో ఆటవస్తువులుగా వినియోగమవుతున్నాయి.
అయితే ఈ బొమ్మలను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మెచ్చుకోవడం విశేషం. ఈ గొప్ప చరిత్ర కలిగిన ఏటికొప్పాక బొమ్మలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శకటం రూపంలో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాయి.