అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి గత ఆరు నెలలుగా వైద్య ఆరోగ్యశాఖ పనితీరు నివేదికను (శుక్రవారం) మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు. వివిధ ప్రధాన ఆరోగ్య పథకాల కింద కొత్తగా తీసుకొచ్చిన 12 కార్యక్రమాలు, మెరుగుపడిన పనితీరును ఈ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు.
- Advertisement -
- పెరుగుతున్న క్యాన్సర్ కేసులను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ ఏడాది నవంబర్ 14న ‘అందరికీ క్యాన్సర్ స్కీన్రింగ్’ ద్వారా ఇప్పటివరకు 33,58,347 మందిని పరీక్షించారు. వ్యాధి నిర్ధారణ, చికిత్స నిర్వహించాల్సిన 29,469 మంది క్యాన్సర్ అనుమానిత మహిళలను గుర్తించారు.
- గ్రామీణ, పట్టణాల్లో పేద ప్రజలు వైద్యంపై చేసే ఖర్చును తగ్గించడం కోసం, వారికి 87 రకాల డయాగ్నస్టిక్ టెస్ట్‌లు చేయడానికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో 3 సిటీ డయాగ్నస్టిక్ సెంటర్‌లను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి.
- ఇ-ఐసియు : మారుమూల, అలాగే గిరిజన ప్రాంత ప్రజల ప్రయోజనం కోసం, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సహకారంతో గోల్డెన్ అవర్ (అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయం నుండి తప్పించేందుకు అవకాశమున్న సమయం)లో తక్షణ వైద్య సేవను అందించడానికి ఏరియా హాస్పిటల్‌లో ఈ సర్వీసును తీసుకొచ్చారు. ఒక్కొక్కటి 8 పడకల సామర్థంతో రంపచోడవరం, పార్వతీపురం జిల్లా ఆసుపత్రులు ప్రారంభమయ్యాయి.
- రోగుల సంరక్షణను మెరుగుపరచడానికి 30 పాయింట్లతో జిజిహెచ్‌లకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మంత్రి సత్యకుమార్ ప్రతినెలా పనితీరును సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జోక్యం చేసుకుని, కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా 2024-25 సంవత్సరానికి ఆయుష్ శాఖ బడ్జెట్ 400 రెట్లు, అంటే రూ.84 కోట్లకు పెరిగింది.
- విపత్తు సంసిద్ధత, విపత్తు సమయంలో వెంటనే స్పందించేందుకు అవసరమైన ప్రణాళిక కోసం సుమారు రూ.14 కోట్లతో విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – వైజాగ్‌లో రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ (సిబిఆర్‌ఎన్) మెడికల్ మేనేజ్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమైంది.
- తృతీయ స్థాయి వైద్య సేవల సౌకర్యాలపై పడుతున్న భారాన్ని, ప్రజలు వైద్యం కోసం చేస్తున్న ఖర్చును తగ్గించే ఉద్దేశ్యంతో అత్యవసర శస్త్ర చికిత్స, ఇంటెన్సివ్ కేర్ సర్వీసులను నిర్వహించడానికి జిల్లా స్థాయిలో మొత్తం రూ.230 కోట్లతో, ఒక్కొక్కటి 75 పడకలతో, 10 క్రిటికల్ కేర్ బ్లాక్‌లను ఏర్పాటు- చేయడమైంది.
- మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (ఎమ్‌ఎస్‌యు) ఏర్పాటు : రూ.20 కోట్ల వ్యయంతో జిజిహెచ్ – గుంటూరులో ఎమ్‌ఎస్‌యు ఏర్పాటు చేయడమైంది. గుంటూరు, విజయవాడ నగరాల్లో వ్యాధి వ్యాప్తిపై రియల్ టైమ్ రిపోర్టింగ్‌తో పాటు వ్యాధి నిఘా కేంద్రంగా పనిచేస్తుంది. వివిధ చోట్ల నుండి ఆరోగ్య సంబంధిత సంఘటనలపై హెచ్చరికలు పంపుతుంది.
- 25 బోధన, జిల్లా ఆసుపత్రులలో జన్ ఔషది కేంద్రాల ఏర్పాటును మొదటి దశలోనే చేయడమైంది, అలాగే గడువులోగా విస్తరించడంపై దృష్టి సారించడమైంది. వైద్య విద్య స్థితిని ఆరోగ్య మంత్రి సమీక్షించిన తర్వాత… బోధన, మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి, ఇతర ప్రముఖ వైద్య సంస్థలతో పోటీ పడటం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో పాల్గొనవలసిందిగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు సూచనలు ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలలు సన్నాహాలు ప్రారంభించాయి.